Kannappa: కన్నప్ప కి అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టాం..! 18 h ago

featured-image

మోహన్ బాబు యూనివర్సిటీ లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియా తో మాట్లాడుతూ కన్నప్ప మూవీ విశేషాలను పంచుకున్నారు. కన్నప్ప మూవీ పనులు ఎంత వరకు వచ్చాయి? అని రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ " గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఊహించని రీతిలో కన్నప్ప మూవీ ని తీర్చిదిద్దాం. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాం. మూవీ పై మాకెంతో నమ్మకం ఉంది. శ్రీకాళహస్తీశ్వరుడి పై ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ పరమేశ్వరుడు ఆదుకుంటారు. ఆయన వరం తో నేను పుట్టాను. నా పేరు భక్తవత్సలం. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఎప్పుడు సర్వ సాధారణం. కానీ ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని సాధించాలని ప్రకృతిని కోరుకుంటున్నా. ప్రజలు, అభిమానుల ఆశీస్సులు కావాలి" అని మోహన్ బాబు కోరారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రానున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD